
ఖమ్మం, 28 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రానికి మణిహారంగా మధిర పట్టణాన్ని తీర్చిదిద్దుతానని, భవిష్యత్తు తరాల వారికి ఉపయోగపడే విధంగా మధిరను మరింత అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉందని డిప్యూటీ సీఎం ఆర్థిక ప్రణాళిక విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం వారు ఖమ్మం జిల్లా మధిర పర్యటన సందర్భంగా మాట్లాడుతూ.. మధిర పట్టణం మహానగరంగా పెరిగిపోతుందని ప్రజలకు అనుగుణంగా పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించి సుందరీకరణంగా తీర్చిదిద్దాలని దీనిలో భాగంగానే అండర్ డ్రైనేజీ నిర్మాణ పనులు అండర్ విద్యుత్ లైన్లు ఏర్పాటు పనులు చేపట్టడం జరిగిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు