న్యూఇయర్ వేడుకలు.. నగరంలోని పబ్లపై ఈగల టీమ్ పంజా
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) మరో రెండు రోజుల్లో దేశంతో పాటు హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేక వేడుకులకు ప్రజలు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ పార్టీల నిర్వాహకులు, ఫబ్లు యువతను ఆకర్షించే విధంగా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్
ఈగల టీమ్ పంజా


హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)

మరో రెండు రోజుల్లో దేశంతో పాటు

హైదరాబాద్ నగరంలో న్యూఇయర్ సందర్భంగా ప్రత్యేక వేడుకులకు ప్రజలు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రైవేట్ పార్టీల నిర్వాహకులు, ఫబ్లు యువతను ఆకర్షించే విధంగా వేడుకలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వాడకంపై ఈగల్ టీమ్ ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి నగరంలోని అనేక పబ్బుల (Pubs)పై ఈగల్ టీమ్ పంజా విసిరింది. ఈ క్రమంలో క్వెక్ ఎరీనా పబ్ (Quake Arena Pub)లో తనిఖీలు నిర్వహించగా.. అనుమానం వచ్చిన యువకులకు టెస్టులు చేసింది. దీంతో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది. కాగా ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా.. న్యూఇయర్ వేడుకల వేళ ఈగల్ టీమ్ చేస్తున్న తనిఖీలు చర్చనీయాంశంగా మారాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande