
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) శాస్త్ర సాంకేతిక పరంగా దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో నేడు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండడానికి కారణం రాజీవ్ గాంధీ దూర దృష్టి వల్లనే అని చెప్పారు. ఆనాడు వాళ్లు చేసిన కృషి వల్లనే నేడు మనం అభివృద్ధి ఫలాలను అందుకుంటున్నామని వ్యాఖ్యానించారు.
పేద ప్రజలకు ఉపయోగపడేలా ఉపాధిహామీ పథకాన్ని తీసుకువస్తే మోడీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు