
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ముద్రించిన 2026 నూతన సంవత్సర కామారెడ్డి నియోజకవర్గ క్యాలెండర్ను ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే మున్సిపల్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని కోరారు. నూతన సంవత్సర క్యాలెండర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, చేపట్టిన అభివృద్ధి పనులను పొందుపరచడం సంతోషంగా ఉందన్నారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు