
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని
నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఏర్పాటు చేయనున్న నుమాయిష్-2026 (85వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన) వివరాలను మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. నుమాయిష్ ను జనవరి 1న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రారంభిస్తారని అన్నారు. ఈ ప్రదర్శనలో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రదర్శించేందుకు స్టాళ్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటికే మొత్తం 1,050 స్టాళ్లకు అనుమతి ఇచ్చామని అన్నారు. జనవరి 1న ప్రారంభమయ్యే నుమాయిష్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగుతుంది. ప్రతి రోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు, శని, ఆదివారాల్లో రాత్రి 11 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ప్రవేశ రుసుమును రూ.50 ఉండగా ఐదేళ్లలోపు పిల్లలకు ఉచిత ప్రవేశం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు