కేసీఆర్ పదేళ్లు ప్రజలను గాలికి వదిలేసారు : మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి భువనగిరి, 28 డిసెంబర్ (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా,
మంత్రి కోమటిరెడ్డి


యాదాద్రి భువనగిరి, 28 డిసెంబర్ (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఆదివారం మంత్రి

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో భాగంగా, వలిగొండ నుంచి కాటేపల్లి వరకు రూ. 49.5 కోట్ల నిధులతో నిర్మించిన ఆర్ & బీ రోడ్డును మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ రోడ్డు ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కేసీఆర్ పదేళ్లు ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.

రెండేళ్ళు ఫామ్ హౌసులో దాక్కొని ఇప్పుడు వచ్చి నీతులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేసారు. ఇక మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై జనవరి 5 నుంచి నిరాహార దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు చేసి.. బీజేపీని ప్రజల్లో ఎండగడతామని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande