ఉపాధి హామీ పథకాన్ని విస్తరిస్తామని చెప్పి నిర్వీర్యం చేస్తారా?: పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.) గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రా
పొన్నం ప్రభాకర్


హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)

గ్రామీణ ప్రజల ఉపాధిని దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. మహాత్మగాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని విస్తరిస్తామని చెప్పి ఇప్పుడు నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలపై భారం మోపేలా కొత్త చట్టంలో 60:40 శాతం నిధుల నిబంధన పెట్టారని, కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపిందన్నారు. ఇవాళ హైదరాబాద్లోని గాంధీ భవన్ లో కాంగ్రెస్ 141వ ఆవిర్భావ దినోత్సవ జరిగాయి. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం.. గాంధీ, నెహ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీ పేర్లు చరిత్రలో లేకుండా చేయాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఇందుకు నిరసనగా రేపు ప్రతి గ్రామంలో గాంధీ, ఫోటోలతో పని చేస్తూ నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande