
ఖమ్మం, 28 డిసెంబర్ (హి.స.) రాజకీయాల్లో నిబద్ధతతో నీతి,
నిజాయితీతో మంచి పేరుతో పని చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారం గ్రామంలో నూతనంగా రూ.75 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.50 లక్షల వ్యయంతో ప్రకాష్ నగర్ కాలనీ లో అంతర్గత సీసీ డ్రైన్లు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సభలో ఆయన మాట్లాడుతూ సత్తుపల్లి కీర్తి ప్రతిష్టలను దేశ నలుమూలల చాటి చెప్పే విధంగా అభివృద్ధిలో జలగం వెంగళరావు తో పోటీపడి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సత్తుపల్లి కి అందించామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు