
హైదరాబాద్, 28 డిసెంబర్ (హి.స.)
న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేలా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే ఎదురయ్యే పరిణామాలను హాస్యంతో కూడిన కఠిన సందేశంగా ఆయన ప్రజలకు గుర్తు చేశారు. 'మియా, డ్రింక్ చేశావా? అయితే స్టిరింగ్కు సలాం చెప్పి క్యాబ్లో వెళ్లు, గూగుల్లో క్యాబ్ బుక్ చేసుకో.. లాయర్ని కాదు' అంటూ ట్వీట్ చేసిన సజ్జనార్, మద్యం సేవించిన తర్వాత వాహనం నడపకుండా క్యాబ్ ఎంచుకోవాలని సూచించారు.
అలాగే మరో ట్వీట్లో, 'మా డాడి ఎవరో తెలుసా', 'మా అంకుల్ ఎవరో తెలుసా', 'మా అన్న ఎవరో తెలుసా'.. అని ఇలా మా ఆఫీసర్లను అడగొద్దు. మేము మీ ప్రైవసీని గౌరవిస్తాం. వాహనం పక్కకు పెట్టి, మళ్లీ తేదీ వచ్చిన రోజు కోర్టులో పరిచయం చేసుకుందాం' అంటూ సెటైర్లు వేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో హైదరాబాద్ పోలీసులది జీరో టాలరెన్స్ విధానం అని ఆయన స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు