
భూపాలపల్లి, 28 డిసెంబర్ (హి.స.)
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్పేట శివారులో పులి సంచారం కలకలం రేపింది. చిట్యాల, టేకుమట్ల, రేగొండ, మానేరు పరివాహక ప్రాంతాల్లో పెద్దపులి తిరుగుతున్నట్లు సమాచారం. జడల్పేట శివారులో ఓ ఎద్దును పులి గొంతు కొరికి చంపింది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పశువులు మేపేందుకు, పొలం పనులకు ఎవరూ ఒంటరిగా వెళ్లవద్దని సూచించారు. పెద్దపులి కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు