భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యం : టీటీడీ చైర్మన్
తిరుమల, 28 డిసెంబర్ (హి.స.) తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలిపిరి మెట్ల మార్గంలోని ఏడో మార్గంలో ఇటీవల ఫస్ట్ ఎయిడ్ సెంటరును (First
తిరుమల


తిరుమల, 28 డిసెంబర్ (హి.స.)

తిరుమలకు వచ్చే భక్తుల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. అలిపిరి మెట్ల మార్గంలోని ఏడో మార్గంలో ఇటీవల ఫస్ట్ ఎయిడ్ సెంటరును (First Aid Centre) ఏర్పాటు చేశారు. సెంటరు ప్రారంభోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ముఖ్య ఆహ్వానితులుగా హాజరైన టీటీటీ చైర్మన్ ఫస్ట్ ఎయిడ్ సెంటరును టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సిహెచ్.వెంకయ్య చౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ అలిపిరి నడక దారిలో ప్రతిరోజూ వేలాది మంది తిరుమలకు చేరుకుంటారన్నారు. వారి ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని ఏడో మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ప్రారంభించామన్నారు. అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో సెంటరును ఏర్పాటు చేశామన్నారు. ఇక్కడ గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలకు కూడా తక్షణ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సేవలను తప్పక వినియోగించుకోవాలని కోరారు. టీటీడీ, అపోలో వైద్యులతో పాటు శిక్షణ పొందిన పారామెడిక్స్ బృందం, ఈసిజి యంత్రం, ఆక్సిజన్ కాన్సంట్రేటర్, నెబ్యులైజర్, అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande