అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిన మినీ వ్యాన్.. ఇద్దరు మృతి
విజయనగరం, 28 డిసెంబర్ (హి.స.) ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి ఇద్దరు మృతి చెందిన ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన వినయ్ కుమార్, దినేశ్ మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్నారు. వార
mini-van-crashes-into-tree-killing-two-


విజయనగరం, 28 డిసెంబర్ (హి.స.)

ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి ఇద్దరు మృతి చెందిన ఘటన విజయనగరం (Vizianagaram) జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం విశాఖపట్నంకు చెందిన వినయ్ కుమార్, దినేశ్ మినీ వ్యాన్ లో ప్రయాణిస్తున్నారు. వారి వాహనం గజపతినగరం (Gajapati Nagaram) చేరుకోగానే ప్రమాదానికి (Road Accident) గురైంది. గజపతినగరం రైల్వే స్టేషన్ సమీపానికి చేరగానే అదుపు తప్పి రోడ్డు అవతలకు వెళ్లింది. చెట్టును బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జు అయ్యింది. ప్రమాద ఘటనను గమనించిన కొందరు విషయాన్ని పోలీసులకు చేరవేశారు. స్పందించిన పోలీసులు సత్వరమే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వినయ్ కుమార్, దినేశ్ అక్కడికక్కడే మరణించినట్లు గుర్తించారు. వారి మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV


 rajesh pande