
అమరావతి, 29 డిసెంబర్ (హి.స.) :రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఉదయం 10.30 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కొత్త జిల్లాలకు సంబంధించిన చర్చ జరిగే అవకాశం ఉంది. తాజా రాజకీయ పరిణామాలు, మెడికల్ కాలేజీల టెండర్లు, పీపీపీ విధానంపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ