సీఎం.చంద్రబాబు రాయచోటి పై స్పష్టత ఇచ్చారు
అమరావతి, 29 డిసెంబర్ (హి.స.) సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఅధ్యక్షతన ఇవాళ (సోమవారం) నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జర
సీఎం.చంద్రబాబు రాయచోటి పై స్పష్టత ఇచ్చారు


అమరావతి, 29 డిసెంబర్ (హి.స.) సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఅధ్యక్షతన ఇవాళ (సోమవారం) నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అనేక కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. ముఖ్యంగా జిల్లాల పునర్విభజన, పరిపాలనా మార్పులు, రెవెన్యూ, పోలీస్ వ్యవస్థల సరిపోలిక, అలాగే కొన్ని ప్రాంతాల అభివృద్ధి అంశాలు ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో మంత్రులకు, ఉన్నతాధికారులకు కీలక సూచనలు చేశారు. రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా ఉండాలంటే భౌగోళిక, జనాభా, పరిపాలనా అవసరాలకు అనుగుణంగా జిల్లాల నిర్మాణం ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం కీలకంగా

ఈ సమావేశంలో రాయచోటి మార్పు అంశంపై ప్రత్యేకంగా సుదీర్ఘ చర్చ జరిగింది. రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ముఖ్యంగా రాజంపేట ప్రాంతానికి చెందిన ప్రజలు తాము రాయచోటితో కలవబోమని స్పష్టంగా చెబుతున్నారని, ఈ పరిస్థితిలో ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నది అర్థం కావడం లేదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ విషయంలో గట్టిగా డిమాండ్ చేస్తున్నారని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే ఒక్క నియోజకవర్గాన్ని మాత్రమే జిల్లా స్థాయికి తీసుకురావడం సాధ్యమా అనే ప్రశ్నను సీఎం లేవనెత్తారు. రాష్ట్ర పరిపాలనలో సమతుల్యత ఉండాలంటే జిల్లాల నిర్మాణం విస్తృతంగా ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. అయితే రాయచోటి నియోజకవర్గాన్ని జిల్లా స్థాయి అభివృద్ధికి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాయచోటి అభివృద్ధి బాధ్యతను తానే స్వయంగా పర్యవేక్షిస్తానని సీఎం స్పష్టం చేశారు. దీని ద్వారా ప్రజల ఆందోళనను తగ్గించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande