
కర్నూలు 29 డిసెంబర్ (హి.స.)
ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ ప్రజెంట్స్ ‘ఈనాడు స్పోర్ట్స్ లీగ్-2025’ క్రికెట్ జిల్లాస్థాయి పోటీలు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. ఈ పోటీల్లో భాగంగా కర్నూలులోని పుల్లారెడ్డి కళాశాల మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కర్నూలు మెడికల్ కాలేజీ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కర్నూలు మెడికల్ కాలేజీ జట్టు 7 వికెట్లు కోల్పోయి 102 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పుల్లారెడ్డి జట్టు 9 వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసి ఓటమిపాలైంది.
ఇదే మైదానంలో శ్రీసుధ జూనియర్ కాలేజీ (డోన్), ఈఎస్‌సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల (నంద్యాల) జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీసుధ జూనియర్ కాలేజీ (డోన్) 7 వికెట్లకు 86 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈఎస్‌సీ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల (నంద్యాల) 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ