ఏపి ప్రభుత్వ సలహాదారులుగా. మంతెన.సత్యనారాయణ
అమరావతి, 29 డిసెంబర్ (హి.స.) అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో
ఏపి ప్రభుత్వ సలహాదారులుగా. మంతెన.సత్యనారాయణ


అమరావతి, 29 డిసెంబర్ (హి.స.)

అమరావతి: ప్రముఖ ప్రకృతి వైద్య రంగ నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. ఏపీ ప్రభుత్వానికి ప్రకృతి వైద్య సలహాదారుగా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం జీవోను జారీ చేసింది. డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు దశాబ్దాలుగా ప్రకృతి వైద్యం ద్వారా ఎంతో మందికి సేవలు అందించారు. ఉండవల్లి కరకట్టపై ప్రకృతి చికిత్సాలయం పేరుతో ఆసుపత్రి ఏర్పాటు చేశారు. విజయవాడ, నరసాపురంలోనూ ఆరోగ్యాలయం కేంద్రాలున్నాయి.

పోచంపల్లి శ్రీధర్‌రావును ప్రభుత్వం సలహాదారుగా నియమించింది. మాస్‌ కమ్యూనికేషన్‌లో ఆయన సేవలు అందిస్తారు. కార్టూనిస్ట్‌ శ్రీధర్‌గా ఆయన సుపరిచితులు. మంతెన, శ్రీధర్‌ రెండేళ్ల పాటు తమ పదవుల్లో కొనసాగనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande