కొత్త సంవత్సర వేడుకలకు ఎటువంటి అవాంఛనీయ.సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన చర్యలు
విజయవాడ 29 డిసెంబర్ (హి.స.) ,:కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోల
కొత్త సంవత్సర వేడుకలకు ఎటువంటి అవాంఛనీయ.సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠమైన చర్యలు


విజయవాడ 29 డిసెంబర్ (హి.స.)

,:కొత్త సంవత్సర వేడుకలు సందర్భంగా నగరంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవాడ నగర పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. డిసెంబర్ 31వ తేదీ అర్థరాత్రి జరగనున్న న్యూ ఇయర్ వేడుకలపై పలు ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు వెల్లడించారు. జనవరి 13వ తేదీ వరకు రాత్రి వేళల్లో అన్ని ఫ్లైఓవర్లు, ముఖ్యమైన రహదారులు మూసివేస్తున్నట్లు తెలిపారు. రహదారులపై అర్థరాత్రి న్యూఇయర్ వేడుకల నిర్వహణను నిషేధించినట్లు చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande