.డిజిటల్.అరెస్ట్ కేసులో పోలీసులు .ఇద్దరని.అరెస్ట్ చేశారు
హైదరాబాద్‌, 29 డిసెంబర్ (హి.స.) : డిజిటల్ అరెస్ట్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. సయ్యద్ సోయబ్ జాహిద్, బెలిమ్ అనస్ రహీమ్‌ను అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన బాధితు
.డిజిటల్.అరెస్ట్ కేసులో పోలీసులు .ఇద్దరని.అరెస్ట్ చేశారు


హైదరాబాద్‌, 29 డిసెంబర్ (హి.స.)

: డిజిటల్ అరెస్ట్ కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. సయ్యద్ సోయబ్ జాహిద్, బెలిమ్ అనస్ రహీమ్‌ను అరెస్ట్ చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన బాధితురాలిని నిందితులు భయపెట్టారు. ప్రభుత్వ, టెలికాం అధికారులుగా నటిస్తూ నకిలీ ఫోన్‌ కాల్స్‌ చేశారు. బాధితురాలి భర్తపై కేసులంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితురాలి నుంచి రూ. 1.95 కోట్లను కాజేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు అందడంతో విచారణ చేపట్టగా.. మ్యూల్ బ్యాంక్‌ ఖాతాల నుంచి నగదు మళ్లించినట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా 22 కేసుల్లో నిందితుల పాత్ర ఉన్నట్లు తేలింది. నిందితుల బ్యాంక్ ఖాతాల నుంచి 3.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డిజిటల్ అరెస్ట్‌ పేరిట డబ్బులు అడిగితే ఎవరూ నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande