అసెంబ్లీ సభ్యుల భాషపై బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి అసంతృప్తి
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) తెలంగాణ అసెంబ్లీలో నేడు జీరో అవర్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలోని నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాము మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా
బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) తెలంగాణ అసెంబ్లీలో నేడు జీరో అవర్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలోని నేతలు మాట్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే తాము మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచిన నేతగా తాము సభలోని సభ్యుల నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉందని, సభలో సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, సభలోని సభ్యులు మీడియా ముందు ముందుగాని, అసెంబ్లీలో గాని తమ భాషను మార్చు కోవాలని ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ.. ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి ప్రస్తావించిన అంశంలో పూర్తిగా మద్దతు ఇస్తామని ఇందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం తమతో కలిసి రావాలని తమకు ఏ పార్టీ నేతలతో కక్షలు లేవని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande