
భద్రాచలం, 29 డిసెంబర్ (హి.స.) భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి
వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా ఈరోజు (సోమవారం) సాయంత్రం స్వామి వారికి తెప్పోత్సవం, మంగళవారం ఉదయం 5 గంటలకు వైకుంఠ ద్వార దర్శనం తిలకించడానికి వేలాది మంది భక్తులు రానున్నారు. వాహనాలు వలన పార్కింగ్ సమస్య తలెత్తకుండా భద్రాచలం ఏ ఎస్ పి విక్రాంత్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
దీనిలో భాగంగా పట్టణ శివారులో 6 ప్రత్యేక పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. సారపాక వైపు నుంచి వచ్చే వాహనాలకు అయ్యప్ప స్వామి టెంపుల్ పక్కన, ఆర్ అండ్ బి స్థలం లో రెండు పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు