అలర్ట్ ఉండండి.. మంత్రులతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి తన ఛాంబర్లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు మంత్రులతో సీఎం భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నీటివాటాల విషయంలో మం
CM revanth


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల

సమావేశాలు వాయిదా పడిన అనంతరం సీఎం రేవంత్రెడ్డి తన ఛాంబర్లో మంత్రులతో సమావేశం నిర్వహించారు. దాదాపు గంట పాటు మంత్రులతో సీఎం భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ముఖ్యంగా నీటివాటాల విషయంలో మంత్రులు అందరూ అలర్ట్ ఉండాలని సీఎం ఆదేశించినట్లు తెలిసింది. బీఆర్ఎస్ తన ఉనికిని కాపాడుకునే పనిలో ఉందని సీఎం రేవంత్ తెలిపారు. సభలో ప్రతిపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సిద్ధం కావాలని సూచించారు. జిల్లాల వారీగా మంత్రులు ఎదురుదాడికి సిద్ధం కావాలన్నారు. సభలో పాయింట్ ఆఫ్ ఆర్డర్ ముఖ్యం అని తెలిపారు. ప్రతిపక్షం అడిగే ప్రతి అంశానికి సమాధానం ఇవ్వాలన్నారు. జనవరి 4 వరకు సభ జరిగే అవకాశం ఉందని సీఎం తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande