పోలీస్ ఇన్స్పెక్టర్ నే బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు..
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) రాచకొండ పోలీసు కమిషనరేట్ కు చెందిన ఓ ఇన్స్పెక్టర్ తన వాట్సాప్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో ఏకంగా 39.37 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ఇనెఃస్పెక్టర్ కు స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులకు భారీగా ఆర్టిఫిషి
సైబర్ నేరం


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

రాచకొండ పోలీసు కమిషనరేట్ కు

చెందిన ఓ ఇన్స్పెక్టర్ తన వాట్సాప్ కు వచ్చిన లింక్ ను క్లిక్ చేయడంతో ఏకంగా 39.37 లక్షలు పొగొట్టుకున్నాడు. సైబర్ నేరగాళ్లు ఇనెఃస్పెక్టర్ కు స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడులకు భారీగా ఆర్టిఫిషియల్ లాభాలు వచ్చాయని బురిడీ కొట్టించారు. పోలీసు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న అధికారికి నవంబర్ నెల 24వ తేదీన వాట్సాప్ కాల్ వచ్చింది. ఆ కాల్ లో మాట్లాడిన గుర్తు తెలియని వ్యక్తి ఆన్ లైన్ ట్రేడింగ్ గురించి వివరించి ఇన్స్ పెక్టర్ ను స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రాం-దేవా ఏ టీం 13 పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చారు.

లింక్ ద్వారా గ్రూప్ లో చేరిన ఇన్స్పెక్టర్ మూడు రోజుల పాటు అన్ని గమనించాడు. అందులో చాలా మంది మీరు ఇచ్చిన సలహాలతో పెట్టిన పెట్టుబడులు రెట్టింపు అయ్యాయని, మేము ధనవంతుల అయ్యామని వంటి మెసేజ్ లు పోస్టు అవుతుండడంతో నమ్మాడు. దీంతో వారు చెప్పినట్లుగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమయ్యే ముందుగా 50 వేల నుంచి పెట్టుబడిగా పెట్టి యూజర్ ఐడి, పాస్వర్డ్ తో ప్రత్యేక పేజీని తీసుకున్నాడు. అలా దశల వారిగా పెట్టుబడులు పెట్టుకుంటు వెళ్ళిన ఇన్స్పెక్టర్ మొత్తం 39.37 లక్షలను గుర్తు తెలియని వ్యక్తులు సూచించిన బ్యాంక్ ఖాతాల్లో వేశాడు.

అతనికి కేటాయించిన పేజీలో భారీగా లాభాలు ఉండడంతో ఖుషి అయ్యాడు. వాటిని విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా ఆ ఆప్షన్ ను తీసేశారు. దీంతో మోసపోయానని గుర్తించిన ఇన్స్పెక్టర్ నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేశాడు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande