
ఖమ్మం, 29 డిసెంబర్ (హి.స.)
జిల్లా పోలీస్ శాఖ పనితీరు బాగుందని, సమిష్టి కృషితో కమిషనరేట్ పరిధిలో నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సోమవారం కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదిక 2025 వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమర్థవంతమైన పోలీసింగ్ తో ఈ ఏడాది దోపిడీలు, దొంగతనాలు, చైన్ స్నాచింగులు, హత్యలు, హత్యాయత్నాలు వంటి ప్రధాన నేరాలు గణనీయంగా తగ్గాయని చెప్పారు. గత ఏడాదితో పోలీస్తే చోరీ సొత్తులో 9 శాతం ఎక్కువ రికవరీ చేశామని, నేరాలు చేధన 11 శాతం పెరిగిందన్నారు. సైబర్ నేరగాళ్లు దోచుకున్న సుమారు 4.5 కోట్లు నగదును బాధితుల అకౌంట్లలో తిరిగి జమ అయ్యేలా చేశామని, మరో 1.5 కోట్లు హోల్డ్ లో పెట్టేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు