నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నల్గొండ, 29 డిసెంబర్ (హి.స.) నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పాత్ లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఉదయం
నల్గొండ కలెక్టర్


నల్గొండ, 29 డిసెంబర్ (హి.స.)

నిరాశ్రయులు, బిచ్చగాళ్లు, ఫుట్ పాత్ లపై పడుకునేవారు చలి తీవ్రతకు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. సోమవారం ఉదయం 5 గంటలకే ఆమె నల్గొండ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో ఉన్న పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి నిరాశ్రయులకు ఏర్పాటు చేసిన వసతి డార్మెటరీలు, మంచాలు, దుప్పట్లు తదితర సౌకర్యాలను పరిశీలించారు. అంతేకాక నిరాశ్రయుల వసతి కేంద్రంలో ఉన్న వారితో మాట్లాడి సౌకర్యాల పై ఆరా తీశారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande