సరికొత్తగా నుమాయిష్.. జనవరి 1న లాంఛనంగా ప్రారంభం
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) 85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు . జనవరి 1
నుమాయిష్..


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

85వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ముస్తాబైంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు . జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ఎగ్జిబిషన్లో దేశం నలుమూలల నుంచి వచ్చే వ్యాపారులు సుమారు 1050 స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు. 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు కానున్నాయి. కాగా.. సుమారు 25 లక్షల వరకు సందర్శకులు వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సొసైటీ ప్రతినిధులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎంట్రీ టికెట్ రూ.50గా నిర్ణయించారు. సాధారణ రోజుల్లో ప్రతి రోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోకి సందర్శకులను అనుమతిస్తారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande