ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
ఖమ్మం, 29 డిసెంబర్ (హి.స.) లారీ, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ నుంచి కారు ఖమ్మం
రోడ్డు ప్రమాదం


ఖమ్మం, 29 డిసెంబర్ (హి.స.)

లారీ, కారు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయిన సంఘటన ఖమ్మం జిల్లా తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వైజాగ్ నుంచి కారు ఖమ్మం వైపు వస్తుండగా తల్లాడ నుంచి సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొట్టగా కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు చిల్లర బాలకృష్ణ (30), రొయ్యల అనిల్(31) అక్కడికక్కడే మృతి చెందారు. మరొక ముగ్గురిని మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande