
న్యూఢిల్లీ, 29 డిసెంబర్ (హి.స.)
దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా
మారిన ఆరావళి పర్వత శ్రేణుల పరిరక్షణపై సుప్రీం కోర్ట్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, ఆరావళి పర్వతాల నిర్వచనం, వాటికి సంబంధించి తలెత్తుతున్న వివాదాస్పద అంశాలను లోతుగా పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పర్యావరణ పరంగా అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఈ పర్వత శ్రేణుల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్, ఆక్రమణలను అరికట్టడమే లక్ష్యంగా కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ అంశంపై సుప్రీంకోర్టు సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణ చేపడుతూ.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆరావళి పర్వతాలు విస్తరించి ఉన్న రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు