ఏపీకి.చెందిన.బాడ్మింటన్ క్రీడ కారిణి సూర్య చరిష్మా కి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు
అమరావతి, 29 డిసెంబర్ (హి.స.) ఏపీకి చెందిన బాడ్మింటన్‌ క్రీడాకారిణి సూర్య చరిష్మాకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 87వ యోనెక్స్‌ సన్‌రైజ్‌ సీనియర్‌ నేషనల్‌ బాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో సూర్య చరిష్మా బంగారు పతకం సాధించారు. ఏపీకి చెందిన మహిళా తొల
ఏపీకి.చెందిన.బాడ్మింటన్ క్రీడ కారిణి సూర్య చరిష్మా కి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు


అమరావతి, 29 డిసెంబర్ (హి.స.)

ఏపీకి చెందిన బాడ్మింటన్‌ క్రీడాకారిణి సూర్య చరిష్మాకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. 87వ యోనెక్స్‌ సన్‌రైజ్‌ సీనియర్‌ నేషనల్‌ బాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో సూర్య చరిష్మా బంగారు పతకం సాధించారు. ఏపీకి చెందిన మహిళా తొలిసారి బంగారుపతకం సాధించడం అద్భుతమైన విషయమని సీఎం పేర్కొన్నారు. అలాగే సీనియర్‌ జాతీయ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో వెండి పతకం సాధించడం పట్ల కూడా సీఎం హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి లోకేశ్‌ కూడా సూర్య చరిష్మాకి అభినందనలు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande