దివంగత సభ్యులకు సంతాపం తెలిపిన అసెంబ్లీ.. జనవరి 2కు వాయిదా
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10. 30 గంటలకు ప్రారంభం అయ్యాయి. జనగణమన గీతాలాపన తో సమావేశాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర
అసెంబ్లీ


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం ఉదయం 10. 30 గంటలకు ప్రారంభం అయ్యాయి. జనగణమన గీతాలాపన తో సమావేశాలను ప్రారంభించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దివంగత సభ్యులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా స్పీకర్.. తుంగుతుర్తి, సూర్యాపేట ఎమ్మెల్యేగా పనిచేసి మరణించిన మాజీ మంత్రి దామోదర్రెడ్డి, చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డిలకు సభ్యులు సంతాపం తెలపారు. అనంతరం జిరో అవర్ భాగంగా వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జనవరి 2వ తేదీకి శాసనసభ వాయిదా పడింది.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande