జనవరి 2కు వాయిదా పడిన శాసనమండలి
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.) తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యాక ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీలకు సభ నివాళులు అర్పించింది. మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానాల
శాసనమండలి


హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ శాసన మండలి వాయిదా పడింది. సోమవారం ఉదయం సభ ప్రారంభమయ్యాక ఇటీవల మరణించిన దివంగత సభ్యులు మాధవరం జగపతిరావు, అహ్మద్ పీర్ షబ్బీలకు సభ నివాళులు అర్పించింది. మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సంతాప తీర్మానాలు చదివి వినిపించారు. అనంతరం సభ్యులు పలు అంశాలపై మాట్లాడారు. ఆ తర్వాత పలు ఆర్డినెన్సులు, డాక్యుమెంట్లను మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం సభను జనవరి 2వ తేదీకి చైర్మన్ వాయిదా వేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande