
హైదరాబాద్, 29 డిసెంబర్ (హి.స.)
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ
విరామం తర్వాత అసెంబ్లీకి హాజరైన విషయం తెలిసిందే. అయితే అందరూ ఉహించినట్లుగాను మాజీ సీఎం కేసీఆర్ సభలో కొన్ని క్షణాల పాటు మాత్రమే ఉండి వెళ్లిపోయాడు. దీంతో కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లడంపై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ సభకు వచ్చింది ప్రజా సమస్యల కోసం కాదని, కేవలం తన నెల జీతం తీసుకోవడానికి, ఎమ్మెల్యే సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు.
అసెంబ్లీకి వస్తున్నారంటూ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ శ్రేణులు భారీగా హైప్ ఇచ్చాయని, తీరా చూస్తే కేసీఆర్ రెండు నిమిషాలు కూడా సభలో ఉండకుండానే వెళ్లిపోయారని విమర్శించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..