
వేములవాడ, 29 డిసెంబర్ (హి.స.)
వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాజన్న ఆలయ విస్తరణ పనులు కొనసాగుతున్న తరుణంలో గత కొద్దిరోజులుగా భక్తులకు భీమన్న దర్శన భాగ్యం కలుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చి స్వామివారికి కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకునీ స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
భక్తుల రద్దీ దృశ్య సోమవారం రోజు రాత్రి 24 గంటల వరకు బద్ది పోచమ్మ ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు