అద్దంకి నియోజక వర్గాన్ని బాపట్ల.లో. చేర్చడం.పై అద్దంకి ప్రజల పోరాటం.ఫలించింది
, అద్దంకి : 30 డిసెంబర్ (హి.స.)అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో చేర్చడంపై అద్దంకి ప్రజలు చేసిన పోరాటం ఫలించింది. యువగళం పాదయాత్రలో యువనేత లోకేశ్‌ ఇచ్చిన హామీ నెరవేరనుంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కృషితో ప్రకాశం జిల్లాలోకి అద్దంకి నియోజకవ
అద్దంకి నియోజక వర్గాన్ని బాపట్ల.లో. చేర్చడం.పై అద్దంకి ప్రజల పోరాటం.ఫలించింది


, అద్దంకి : 30 డిసెంబర్ (హి.స.)అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో చేర్చడంపై అద్దంకి ప్రజలు చేసిన పోరాటం ఫలించింది. యువగళం పాదయాత్రలో యువనేత లోకేశ్‌ ఇచ్చిన హామీ నెరవేరనుంది. మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ కృషితో ప్రకాశం జిల్లాలోకి అద్దంకి నియోజకవర్గం విలీనం కానుంది. గత వైకాపా ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గ పరిధిని జిల్లాగా మారుస్తున్నామని 2022 మార్చి 4న ప్రకటించింది. ఆ మేరకు ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చారు. తదనుగుణంగా అదే ఏడాది ఏప్రిల్‌ 4 నుంచి అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లాలోకి మార్చారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. ఈ నేపథ్యంలో 2023 డిసెంబరులో యువగళం పాదయాత్రలో లోకేశ్‌ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలుపుతామంటూ హామీ ఇచ్చారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశంలో కలుపుతూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం లభించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande