అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్.డ్రైన్ ఆధునీకరణకు డిప్యూటీ సీఎం.పవన్.కళ్యాణ్.శంకుస్థాపన
అమరావతి, 30 డిసెంబర్ (హి.స.): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ) వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో ప
అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్.డ్రైన్ ఆధునీకరణకు డిప్యూటీ సీఎం.పవన్.కళ్యాణ్.శంకుస్థాపన


అమరావతి, 30 డిసెంబర్ (హి.స.): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని శంకరగుప్తం మేజర్‌ డ్రెయిన్‌ ఆధునికీకరణ పనులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ ) వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా వర్చువల్‌గా హాజరయ్యారు.

కోనసీమ కొబ్బరి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రూ.20.77 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనులకు పవన్‌ శ్రీకారం చుట్టారు. ఇటీవల రాజోలులో తన పర్యటన సందర్భంగా 45 రోజుల్లో సమస్యను పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. 35 రోజుల్లోపే ఈ సమస్యకు సీఎం చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ పరిష్కారం చూపినట్లు జనసేన పార్టీ పేర్కొంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande