
తిరుపతి, 30 డిసెంబర్ (హి.స.), :వైకుంఠ ఏకాదశి సందర్భంగా దంపతులు ఆలయానికి బయలుదేరారు. తెల్లవారుజామునే తమ బైక్‌లో ఆలయానికి వెళ్తున్న వారికి ఊహించని ప్రమాదం వెంటాడింది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ శ్రీనివాసం సమీపంలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ