తెలంగాణలో చంపేస్తున్న చలి.. సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు
తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి చేరాయి. నేటి ఉదయం నమోదుల ప్రకారం ఆదిలాబ
చలి


తెలంగాణ, 30 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి చేరాయి. నేటి ఉదయం నమోదుల ప్రకారం ఆదిలాబాద్ 6.7, పటాన్చెరులో 8.4, రాజేంద్రనగర్లో 9.5, మెదక్లో 8.8, హనుమకొండలో 10.5, రామగుండంలో 11.5 అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అదేవిధంగా ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సమయంలో పొగమంచు తీవ్రంగా కనిపిస్తోంది.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande