
సూర్యాపేట, 30 డిసెంబర్ (హి.స.) సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పట్టణంలోని కీలక ప్రాంతాల్లో మంగళవారం బాంబు స్క్వాడ్ విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించింది. నూతన సంవత్సరం డిసెంబర్ 31 ముక్కోటి ఏకాదశి పండుగ సందర్భంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు రద్దీ ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ సిబ్బంది సోదాలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు