
భూపాలపల్లి, 30 డిసెంబర్ (హి.స.)
భూపాలపల్లి జిల్లా ఎస్సీ హాస్టల్ వార్డెన్ భవాని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. భవాని హాస్టల్ లో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కొడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం పై సోషల్ వెల్ఫేర్ డిడి విచారణ చేపట్టి నివేదిక సమర్పించడంతో జిల్లా కలెక్టర్ భవాని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సోమరుదు విద్యార్థి సంఘాలు హాస్టల్ వార్డును సస్పెండ్ చేయాలని నిరసన వ్యక్తం చేసిన విషయం విధితమే. హాస్టల్ లో జరిగిన సంఘటనపై పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు