శరవేగంగా మేడారం పనులు.. కలెక్టర్ దివాకర ఆదేశాలు
ములుగు, 30 డిసెంబర్ (హి.స.) వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనుల వేగం పెంచింది. జాతరకు ఇప్పటి నుంచే భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం జాతర ప్రాంతాన్ని 8
కలెక్టర్ దివాకర


ములుగు, 30 డిసెంబర్ (హి.స.)

వచ్చే ఏడాది జనవరి 28 నుంచి

ప్రారంభం కానున్న మేడారం జాతరను దృష్టిలో పెట్టుకొని అధికార యంత్రాంగం పనుల వేగం పెంచింది. జాతరకు ఇప్పటి నుంచే భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మొత్తం జాతర ప్రాంతాన్ని 8 జోన్లు, 47 సెక్టార్లుగా విభజించి, ప్రతి సెక్టార్కు ఒక అధికారితో పాటు ఎనిమిది మంది సిబ్బందిని నియమించారు. ఈ అధికారులు జనవరి 1 నుంచే విధుల్లో చేరాలని కలెక్టర్ దివాకర ఆదేశాలు జారీ చేసారు. జాతర ముగిసే వరకు స్థానికంగానే ఉంటూ టాయిలెట్లు, తాగునీటి సౌకర్యాలు, రోడ్ల పనులు, ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ప్రదేశాలు వంటి ప్రతి అంశంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande