త్వరలో మున్సిపల్ ఎన్నికలు.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
హుజూర్నగర్, 30 డిసెంబర్ (హి.స.) తెలంగాణ రాష్ట్రంలో మున్సిపాలిటీ & మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి చివరి వారంలో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ తరుణంలో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ న
మంత్రి ఉత్తమ్


హుజూర్నగర్, 30 డిసెంబర్ (హి.స.)

తెలంగాణ రాష్ట్రంలో

మున్సిపాలిటీ & మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జనవరి చివరి వారంలో కానీ, ఫిబ్రవరి మొదటి వారంలో కానీ నిర్వహించే అవకాశం ఉంది. ఈ తరుణంలో హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని హుజూర్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మంగళవారం ఒక ప్రకటన ద్వారా పిలుపునిచ్చారు. ఈ శాసనసభసమావేశాలు ముగియగానే హుజూర్ నగర్ నేరేడుచర్ల మున్సిపాలిటీ లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక & ప్రచార కార్యక్రమాల పై చర్చిద్దాం అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande