
సంగారెడ్డి, 30 డిసెంబర్ (హి.స.) ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని
పురస్కరించుకొని సంగారెడ్డి శివారులోని వైకుంఠపురం భక్తజన సందోహంగా మారింది. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన స్వామి వారి పూజా కార్యక్రమాలు కొనసాగుతూ వస్తున్నాయి. ఆలయ ప్రధాన అర్చకుడు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో వేకువజామున ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం స్వామివారికి పల్లకి సేవ నిర్వహించారు.
ఈ పల్లకి సేవలో మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు ఆయన కుటుంబ సభ్యులు పాల్గొని స్వామివారి సేవలో తరించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు