
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
సంక్రాంతి సమయంలో రహదారులపై రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారిపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ మంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ... సంక్రాంతికి వెళ్లేవారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని చెప్పారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్-విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువ ఉంటుందని, ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫల్మ్ సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు