
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
డెస్క్ జర్నలిస్టులకు నష్టం కలిగించే అంశాలను జీవో నెం.252లో సవరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇవాళ సచివాలయంలో డెస్క్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులతో మంత్రి పొంగులేటి చర్చించి వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రిడిటేషన్ కార్డులు, మీడియా కార్డులకు ఎలాంటి తేడా లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వపరంగా అక్రిడిటేషన్ కార్డుదారులకు వర్తించే ప్రతి ప్రయోజనం మీడియా కార్డు ఉన్న వారికి కూడా వర్తిస్తుందని అన్నారు. ఈ విషయంలో డెస్క్ జర్నలిస్టులు ఎలాంటి అపోహలకు గురికావొద్దని, జీవో నెం. 252లో మార్పులు, చేర్పులు చేసి లిఖితపూర్వకంగా ఇస్తామని హామీ ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..