వెంకటేశ్వర స్వామి సేవలో మంత్రి పొన్నం దంపతులు
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు తెలంగాణ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్ లోని హిమాయత్నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరగా.. మం
మంత్రి పొన్నం


హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)

వైకుంఠ ఏకాదశి సందర్భంగా నేడు

తెలంగాణ వ్యాప్తంగా వైష్ణవ ఆలయాల్లో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. హైదరాబాద్ లోని హిమాయత్నగర్ వేంకటేశ్వరస్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తులు ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసారు. అలాగే వనస్థలిపురం శ్రీపద్మావతి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాదగిరిగుట్ట, భద్రాచలం, వారాసిగూడ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం, నిజామాబాద్ జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande