
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.)
యూరియా విషయంలో రైతులు
ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేసారు. యూరియా కొరత లేదని, సరఫరా కొనసాగుతోందని అన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 47.68 లక్షల సంచుల యూరియా స్టాక్ ఉందని తెలిపారు. రబీ సీజన్(అక్టోబర్ నుంచి మార్చి)లో కేంద్రం రాష్ట్రానికి 20.10 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి అందిన 5.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాలో 3.71 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేయగా.. ఇంకా ప్రభుత్వం వద్ద 2.15 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ ఉందని మంత్రి తుమ్మల పేర్కొన్నారు. అయితే నిన్న అసెంబ్లీలో విపక్ష ఎమ్మెల్యేలు సరిపడా యూరియా లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..