
నాగర్ కర్నూల్, 30 డిసెంబర్ (హి.స.)
పవిత్రమైన ముక్కోటి ఏకాదశి అతి పురస్కరించుకొని మక్తల్ పట్టణంలోని పురాతనమైన దేవాలయాలను మంగళవారం తెల్లవారుజామున మంత్రి వాకిటి శ్రీహరి దర్శించుకుని పూజలు చేశారు. శ్రీ పడమటి ఆంజనేయ స్వామిని కోనేట్లో శ్రీ అయ్యప్ప స్వామి అభిషేకం, మారుతి నగర్ కొలువై ఉన్న అతి పురాతనమైన శ్రీ జనార్ధన శ్రీ శివ కేశవ స్వాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హిందువులకు అత్యంత పవిత్రమైన ముక్కోటి ఏకాదశిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో తెల్లవారుజామునే శ్రీమహావిష్ణువు అవతారమైన మందిరాలను దర్శించుకుంటారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు