
గోదావరిఖని, 30 డిసెంబర్ (హి.స.)
తాత్కాలిక ఆనందం కోసం
భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ఆనందంగా వేడుకలు జరుపుకోండి కానీ చట్టానికి లోబడి మాత్రమే జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. మంగళవారం కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుండి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించబడునని, డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి, బైండ్ ఓవర్ చేస్తామన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..