
హైదరాబాద్, 30 డిసెంబర్ (హి.స.) తెలంగాణలో మళ్లీ యూరియా కొరత ఉందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో జిల్లాల వారీగా యూరియా నిల్వల వివరాలను ఇవాళ వ్యవసాయ శాఖ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 47,68,029 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఇక అత్యధికంగా నల్గొండ జిల్లాలో 3,09,679 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాలో 3,09,681 మెట్రిక్ టన్నులు, వికారాబాద్ జిల్లాలో 2,91,808 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లుగా నివేదికలో స్పష్టం చేశారు.
అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో 2,44,008 మెట్రిక్ టన్నులు, మహబూబ్నగర్ జిల్లాలో 2,34,608 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయి. వనపర్తి జిల్లాలో 64,517 మెట్రిక్ టన్నులు, ములుగు జిల్లాలో 71,505 మెట్రిక్ టన్నులు, మెదక్ జిల్లాలో 1,22,402 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ డిలర్ల ద్వారా 31,077 మెట్రిక్ టన్నులు, సహకార సంఘాల ద్వారా 16,755 మెట్రిక్ టన్నులు, మార్కెఫెడ్ ద్వారా 1,66,730 మెట్రిక్ టన్నులు, మొత్తం డిమాండ్ 2,14,561 మెట్రిక్ టన్నులకు వ్యతిరేకంగా భారీ నిల్వలు అందుబాటులో ఉన్నాయి. ఈ నిల్వలతో రాబోయే రబీ సీజన్లో రైతులకు ఎరువుల కొరత లేదని, ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని వ్యవసాయ శాఖ అధికారులు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..