
వేములవాడ, 30 డిసెంబర్ (హి.స.)
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఫిబ్రవరి 14, 15,16వ తేదీల నిర్వహించే మహా శివరాత్రి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. మహా జాతర ఏర్పాట్లపై మంగళవారం భీమేశ్వర సదన్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్, మహా జాతర సమన్వయ కమిటీ చైర్మన్ గరిమ అగ్రవాల్ అధ్యక్షతన మహా జాతర మొదటి సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన విప్ మాట్లాడుతూ రూ.150కోట్లతో ప్రధాన ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి మాదిరిగానే భీమన్న ఆలయంలో భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు జాతర ఏర్పాట్లలో నిమగ్నమై ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు