
వేములవాడ, 30 డిసెంబర్ (హి.స.)
ముక్కోటి ఏకాదశి వేడుకలు దక్షిణ
కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానంలో కన్నుల పండుగగా జరిగాయి. వేడుకల్లో భాగంగా రాజన్న ఆలయంలో అర్చకులు స్వామివారికి ఏకాంతంగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
తదనంతరం ప్రత్యేకంగా అలంకరించిన అంబారి సేవపై ఉత్సవమూర్తులను ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. దేవాలయంలో మూడు ప్రదక్షిణలు చేసిన తదుపరి భక్తులకు దర్శనం కల్పించగా ఉత్తర ద్వారం గుండా భక్తులు వెళ్ళి శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారిని, శ్రీ లక్ష్మీ సమేత అనంత పద్మనాభ స్వామి వారిని దర్శించుకున్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు